- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హలో..! తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా రోబో
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2025' ఇవాళ అట్టహాసంగా ప్రారంభం అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2025' ఇవాళ అట్టహాసంగా ప్రారంభం అయింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మిట్‌ను ప్రారంభించారు. అయితే, సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన హ్యూమనాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమ్మిట్‌కు వస్తున్న అతిథులకు రోబో స్వాగతం పలుకుతూ సందడి చేసింది. సదస్సుకు వచ్చిన ప్రతినిధులు రోబోతో ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు రోబో వారిని హలో అంటూ పలకరిస్తూ షేక్ హ్యాండ్ ఇంస్తోంది. గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలను వారికి వివరిస్తూ ఉంది. ప్రస్తుతం ఆ రోబోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ‘ఫ్యూచర్ సిటీ’లో జరుగుతోంది. ఫ్యూచర్ సిటీలోని 70 ఎకరాల్లో సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. సమావేశ ప్రాంగణాలు, చర్చా వేదికలు, వాహనాల పార్కింగ్ లు, అతిథులు విశ్రాంతి తీసుకునేందుకు సైతం సకల వసతులతో ఏర్పాట్లు చేశారు. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఘనతను ప్రపంచానికి చాటి చెప్పేలా సమ్మిట్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. భారీ భద్రత నడుమ.. మొత్తంగా చరిత్రలో నిలిచిపోయేలా అదిరిపోయే రీతిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. వీడియో ఇదే..






