Breaking News : హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం

by Muthe.Rajitha |

సక్రాంతి పండుగ(Sankranthi Festival) ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరిగి నగరానికి ప్రయాణమయ్యారు.

Breaking News : హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జాం
X

దిశ, వెబ్ డెస్క్ : సక్రాంతి పండుగ(Sankranthi Festival) ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరిగి నగరానికి ప్రయాణమయ్యారు. ఏపీ(AP) నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హైదరాబాద్‌(Hyderabad)కు చేరుకుంటున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే అన్ని ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీకారణంగా యాదాద్రి భువనగిరిలోని పంతంగి టోల్‌ ప్లాజా(Panthangi Toll Plaza) వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. నల్లగొండ జిల్లాలోని కొర్లపాడు టోల్‌ప్లాజా(Korlapadu Toll Plaza) వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. సర్వర్లు, స్కానర్లు పని చేయకపోవడంతో గేట్లు ఓపెన్‌ కాక వాహనాలు బారులు తీరాయి. టోల్‌ సిబ్బంది హ్యాండ్‌ గన్స్‌తో స్కాన్‌ చేస్తుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో అంతకంతకూ రద్దీ పెరుగుతోంది. పోలీసులు కలగజేసుకొని ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు.

Next Story