- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతికి ఊరెళ్తున్న వారికి BIG అలర్ట్.. అక్కడ కిలోమీర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్(Choutuppal) మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా(Pantangi Toll Plaza) వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్(Choutuppal) మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా(Pantangi Toll Plaza) వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. సంక్రాంతి(Sankranthi) వేళ హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా సొంత గ్రామాలకు బయలుదేరడంతో టోల్‌ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం నెమ్మదిగా కదులుతున్నట్లు సమాచారం. నిన్న(శుక్రవారం) ఒక్కరోజే పంతంగి టోల్‌ప్లాజా నుంచి ఏకంగా 59 వేల వాహనాలు వెల్లగా.. ఇవాళ మధ్యాహ్ననికే 55 వేలకు పైగా దాటి వెళ్లాయని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. సాయంత్రం నుంచి వాహనాల సంఖ్య మరింత పెరడంతో ఆ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో 30 నుంచి 35 వేల వాహనాల రాకపోకలు సాగిస్తుండగా.. పండుగ నేపథ్యంలో పది నుంచి 15 వేలకు పైగా వాహనాలు అదనంగా ప్రయాణం సాగిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు భారీగా వాహనాలు వెళుతున్నాయి.






