- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండుగ రద్దీ.. హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారు హైవేపై క్యూ కట్టారు. సొంత వాహనాల్లో సొంతూళ్లకు పయనమవ్వగా.. హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: వీకెండ్, జూనియర్ కాలేజీలకు కూడా నేటి నుంచి పండుగ సెలవులు ప్రకటించడంతో.. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారు హైవేపై క్యూ కట్టారు. సొంత వాహనాల్లో సొంతూళ్లకు పయనమవ్వగా.. హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో హయత్ నగర్లో కిలోమీటర్ల మేర వాహనాలు నలిచిపోయాయి. దీనికితోడు వర్షాలు, ఆ వర్షాలకు పోటెత్తిన మూసీ.. వెరసి వరద కారణంగా కూడా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
అబ్దుల్లాపూర్ మెట్ మండలం గౌరెల్లి వద్ద వంతెనపై వరద ప్రవహిస్తుండటంతో.. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గౌరెల్లి వంతెన వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులు.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఉప్పల్ - వరంగల్ రూట్లోనూ వరద ప్రభావం ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Next Story






