నేడు, రేపు తెలంగాణలో ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. తస్మాత్ జాగ్రత్త !

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-12 13:21:50  IST  )

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం (Low Pressure) ఏర్పడనుందని పలు వాతావరణ సంస్థలు పేర్కొన్నాయి.

నేడు, రేపు తెలంగాణలో ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. తస్మాత్ జాగ్రత్త !
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం (Low Pressure) ఏర్పడనుందని పలు వాతావరణ సంస్థలు పేర్కొన్నాయి. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై నేటి నుంచే ఉంటుందని కొన్ని ప్రైవేట్ వాతావరణ సంస్థలు పేర్కొన్నాయి. నేడు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించాయి. తెలంగాణ వెదర్ మ్యాన్ (Telangana Weather Man) చెప్పిన రిపోర్ట్ ప్రకారం.. నేడు, రేపు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి.

పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిరిసిల్ల, కరీంనగర్, సిద్ధిపేట, జనగామ, మంగళగిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

ఆగస్టు 14,15 తేదీల్లో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. నారాయణపేట, వనపర్తి, గద్వాల, నల్గొండ, యాదాద్రి, మల్కాజ్గిరి, జనగామ, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఉద్యోగులు, విద్యార్థులంతా త్వరగా ఇళ్లకు చేరుకోవాలని, వీలైనంత వరకూ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని పోలీసులు సూచించారు.

Next Story