హైదరాబాద్‌లోని ఆ హోటళ్ల వద్ద హైసెక్యూరిటీ

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని ఆ హోటళ్ల వద్ద హైసెక్యూరిటీ

హైదరాబాద్‌లోని ఆ హోటళ్ల వద్ద హైసెక్యూరిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్‌కు పోలీస్‌శాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు హై-సెక్యూరిటీ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. వారికి ఎస్కార్ట్‌లు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధాన అధికారులు సన్నిహితంగా సమన్వయంతో భద్రతను పర్యవేక్షిస్తారు. వీవీఐలకు డీఎస్పీ, ఇన్స్‌పెక్టర్ స్థాయి అధికారులతో మూడెంచల భద్రత కల్పించనున్నారు. పోలీస్‌శాఖ సమగ్రమైన, బహుళ-స్థాయి భద్రతా ఏర్పాటు చేసింది. వేదిక, మార్గాలు, పరిసర ప్రాంతాల పూర్తి కవరేజీని నిర్ధారించడానికి మొత్తం భద్రతా ప్రణాళికను 18 రంగాలుగా విభజించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ సమ్మిట్ నిర్వహిస్తునందున లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, అక్టోపస్, గ్రేహౌండ్స్, డాగ్, బాంబ్ స్క్వాడ్స్తో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సుకు సుమారు 2686 మంది పోలీసు బలగాలతో బందోబస్తు చేపట్టనున్నారు. 25 మంది డీసీపీలు, 17మంది ఏడీసీపీలు, 51మంది ఏసీపిలు, 98మంది సీఐ,266మంది ఎస్‌ఐలు 270మంది ఏఎస్ఐలు, 1959మంది పీసీలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.

Next Story