అలర్ట్.. ఈ రోజు భారీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు

by Malleboina Mahesh |

ఈ రోజు కూడా ఉపరితల ఆవర్తణం ఎఫెక్ట్‌తో ఉత్తర, పశ్చిమ, మధ్య తెలంగాణలో మోస్తారు నుంచి భారీ తుఫాన్ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

అలర్ట్.. ఈ రోజు భారీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలపై ఆవరించి ఉన్న ఉపఉరితల ఆవర్తన ద్రోణి (Subarctic trough) ప్రభావంతో గత మూడు రోజులుగా వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని మెదక్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అయితే ఈ రోజు కూడా ఉపరితల ఆవర్తణం ఎఫెక్ట్‌తో ఉత్తర, పశ్చిమ, మధ్య తెలంగాణలో మోస్తారు నుంచి భారీ తుఫాన్ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ (Department of Meteorology) అంచనా వేసింది.

ఇందులో భాగంగా.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి - భువనగిరిలలో అక్కడక్కడా తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన తుఫానులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మహానగరం హైదరాబాద్‌ (Hyderabad)లో మధ్యాహ్నం వరకు పొడిగా ఉంటుందని, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తుఫానులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story