భారీ వర్షాలు.. జలమండలి హై అలర్ట్!

by Ramesh Naini |

నగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.

భారీ వర్షాలు.. జలమండలి హై అలర్ట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో భారీ వర్షం (Heavy rains) కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి (Water Board MD Ashok Reddy) ఆదేశించారు. నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. అధికారులు 24 గంటలు క్షేత్ర స్థాయిలో సిబ్బందితో పర్యవేక్షించుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తరచూ సీవరేజీ ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్ హోళ్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నీరు నిలిచే ప్రాంతాలపైన ఈ బృందాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఈ సమయంలో కలుషిత నీరు సరఫరా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరాపై అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఈ ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముంపున‌కు గురైన ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్ల ద‌గ్గ‌ర హెచ్చ‌రిక బోర్డులు ఏర్పాటు చేయాల‌ని, డీప్ మ్యాన్‌హోళ్ల ద‌గ్గ‌ర సీవ‌రేజి సూప‌ర్‌వైజ‌ర్లు ఉండేలా చూడాల‌ని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్ శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. న‌గ‌ర ప్ర‌జ‌లు ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్ మూత‌ల‌ను తెర‌వ‌కూడ‌దని ఆయ‌న సూచించారు. ఇత‌ర వివ‌రాలకు జ‌ల‌మండ‌లి క‌స్ట‌మర్ కేర్ 155313కి కాల్ చేయాల‌ని ఆయ‌న కోరారు.

Next Story