- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: తెలంగాణలో భారీ వర్షాలు
రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గాలివేగం గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆయా జిల్లాలలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శనివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 2 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 2 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది. అలాగే రానున్న రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. తర్వాతి నాలుగు రోజుల్లో అవి క్రమంగా 2 నుండి 4 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.






