- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కుంభవృష్ఠి.. జిల్లాల మధ్య రాకపోకలు బంద్.. వాగులో చిక్కుకుని కార్మికుల ఆర్తనాదాలు
తెలంగాణలో నిన్న (మంగళవారం) సాయంత్రం నుంచి ఎడతెరపి లేని వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నిన్న (మంగళవారం) సాయంత్రం నుంచి ఎడతెరపి లేని వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా మెదక్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదయ్యింది. రామాయంపేటలో 20 సెంటీమీటర్లు, టేక్మాల్ లో 18.3 సెంటీమీటర్లు, శంకరంపేటలో 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో రామాయంపేట - కామారెడ్డిల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులపైకి వర్షపునీరు చేరడంతో పండుగశోభ అంతా వర్షార్పణమైనట్లైంది. పలు కాలనీలు, ఇళ్లు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ లో 17.1 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా పిట్లంలో 15.8, నిజాంపేటలో 15.3 సెంటీమీటర్లు, భువనగిరిలో 13.2 సెంటీమీటర్లు, లింగంపేట్ లో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. యాదగిరి గుట్టలో 11.7, నాగిరెడ్డిపేట్ లో 11.6 సెంటీమీటర్లు, మహ్మద్ నగర్లో 10.2, సిరగపూర్ లో 10, కల్హేర్ లో 9.5, హవేలి ఘన్ పూర్లో 9.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలకు బొగ్గుగుడిసె వాగులో 10 మంది కార్మికులు చిక్కుకున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులకోసం వచ్చిన వారిని వరద చుట్టుముట్టడంతో.. వాటర్ ట్యాంకర్ పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.






