Heavy rains : రాష్ట్రంలో పలుచోట్ల కురిసిన భారీ వర్షాలు.. అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లా అదే..

by Ramesh Naini |

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Heavy rains : రాష్ట్రంలో పలుచోట్ల కురిసిన భారీ వర్షాలు.. అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లా అదే..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 13 సెం.మీల వర్షం నమోదైనట్లు పేర్కొంది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం స్థానిక వాతావరణ పరిస్థితులపై, తెలంగాణలోని పలు జిల్లాల్లో స్వల్పంగా ఉండవచ్చని తెలిపింది. ఈ కారణంగా రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ , వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కి.మీ తో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

వర్షాపాతం వివరాలు:

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 13 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం లో 11 సెం.మీ, మహబూబాబాద్ లో 11 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో 11 సెం.మీ, బూర్గంపాడులో 10 సెం.మీ, వరంగల్ జిల్లా నల్లబెల్లిలో 9 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 9 సెం.మీ, ములుగు జిల్లా వెంకటాపురంలో 9 సెం.మీ, గూడూరువర్గల్ లో 9 సెం.మీ, బయ్యారంలో 7 సెం.మీ, ములుగు జిల్లా తాడ్వాయిలో 7 సెం.మీ, వరంగల్ జిల్లా చెన్నారావుపేట్ లో 7 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో 6 సెం.మీ, భద్రాచలంలో 6 సెం.మీ, పినపాకలో 6 సెం.మీ, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో 6 సెం.మీ, నల్గొండ జిల్లా నిడమనూరు లో 6 సెం.మీ, వరంగల్ జిల్లా పర్వతగిరిలో 6 సెం.మీ, నర్సంపేట్ లో 5 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల పల్లెలో 5 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో 4 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది.

Next Story