Heavy Rain Alert:బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-12 02:22:50  IST  )

రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Heavy Rain Alert:బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ(Telangana)లో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం పేర్కొంది. వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ(శనివారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అలాగే.. రేపు, ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక, ఈ నెల(జూలై) 16వ తేదీ నుంచి కేవలం పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ(Department of Meteorology) అధికారులు సూచించారు.

Next Story