- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమ్ముకొస్తున్న మేఘాలు.. మరో రెండు గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ లోని 11 జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో వరుసగా కురిసిన భారీ వర్షాల (Heavy rains) కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వరదలు సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఈ వరదలను మరిపించేలా గత వారం రోజులుగా వరంగల్ మినహా అన్ని జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు (Maximum temperatures) నమోదవుతున్నాయి. దీంతో ఎండలకు బయటకు రావడానికి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని జిల్లాలకు వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది. మరికొద్ది సేపట్లో ఉపరితల ఆవర్తనం (Surface periodicity) కారణంగా 11 జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని అంచనా వేసింది.
అయితే మొదట భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసినప్పటికీ మేఘాల ప్రభావం తగ్గడంతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తాజా అలర్ట్ ప్రకారం ఇప్పటికే అనేక జిల్లాలను దట్టమైన మేఘాలు కమ్ముకొన్నాయని, రానున్న రెండు గంటల్లో సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి - కొత్తగూడెం, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. అలాగే దక్షిణ HYDలో శంషాబాద్ - బాలాపూర్ , శేర్‌లింగంపల్లి ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ (Department of Meteorology) అంచనా వేసింది.






