- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Heavy Rains Alert: రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: (Heavy Rains Alert) రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం కారణంగా రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, కొన్నిసార్లు 60 కిలోమీటర్ల వేగాన్ని కూడా చేరుకోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
పలు జిల్లాల్లో జనజీవనం స్తంభన
కరీంనగర్, మెదక్, జనగాం జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ముఖ్యంగా కరీంనగర్, మెదక్, జనగాం జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లాలో అక్కడక్కడా అతి భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే మెదక్ జిల్లాలో కూడా అతిభారీ వర్షాలు కురిసినట్లు ఐఎండీ పేర్కొంది.
వర్షపాతం నమోదైన ప్రాంతాలు..






