రాష్ట్రంలో భారీ వర్షాలు.. అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో హైదరాబాద్‌ (Hyderabad)‌తో సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి.

రాష్ట్రంలో భారీ వర్షాలు.. అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో హైదరాబాద్‌ (Hyderabad)‌తో సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో పాత ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని సూచించారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. హైద‌రాబాద్‌ నగరంలోని హైడ్రా, GHMC, SDRF, అగ్నిమాప‌క‌, ట్రాఫిక్, పోలీసు అధికారులు కో-ఆర్డినేట్ చేసుకుని ఎక్కడా ఎలాంటి సమస్యలు త‌లెత్తకుండా చూడాల‌ని సీఎం రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. వాగులపై ఉన్న లోత‌ట్టు కాజ్‌వేలు, క‌ల్వర్టుల‌ పైనుంచి నీటి ప్రవాహాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చెరువులు, కుంటలకు గండిప‌డే ప్రమాదం ఉన్నందున నీటి పారుద‌ల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Next Story