రాష్ట్రంలో దంచికొడుతున్న వర్షాలు.. కాసేపట్లో కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-30 09:35:17  IST  )

రాష్ట్రంలో మొంథా తుఫాను (Montha Cyclone) ప్రభావంతో తెలంగాణ (Telangana) వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి.

రాష్ట్రంలో దంచికొడుతున్న వర్షాలు.. కాసేపట్లో కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మొంథా తుఫాను (Montha Cyclone) ప్రభావంతో తెలంగాణ (Telangana) వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)ను టెన్షన్ పెట్టించిన ఇదే ‘మొంథా’ తెలంగాణపై విరుచుకుపడుతోంది. అయితే, ఈ తుపాను మంగళవారం రాత్రికి కోస్తాంధ్ర నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశాలవైపు వెళ్తుందని భావించగా.. అనూహ్యంగా దిశను మార్చుకుని ఉత్తరాంధ్ర, తెలంగాణ సరిహద్దుల మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) వైపు కదులుతోంది. ఈ ప్రభావంతో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలను తపాను అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఇవాళ ఉదయం 11 సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయక చర్యలపై అందరికీ దిశానిర్దేశం చేయనున్నారు.

కాగా, మంగళవారం రాత్రి నుంచి హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తుపాను ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల ధాటికి వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. పలు రైళ్లు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరోవైపు డిండి (Dindi) వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో శ్రీశైలం హైవే కొట్టుకుపోయి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.

READ MORE ....

ప్రతీ ఒక్క అధికారి ఫీల్డ్‌లోనే ఉండాలి.. కలెక్టర్లతో వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి

Next Story