- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాళ తెలంగాణకు భారీ వర్షాలు..13 జిల్లాలకు ఎల్లో అలర్ట్..ఆ రైతులకు ఊరట
తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది వాతావరణ శాఖ. అంతేకాదు 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు 15 రోజులపాటు వర్షాలకు బ్రేక్ లాగా.. మళ్లీ రెండు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
అంతేకాదు 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ లిస్టులో ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం , మెదక్ సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూల్, సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి ములుగు జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరవ్యాప్తంగా కూడా వర్షాలు పడనున్నట్లు స్పష్టం చేసింది వాతావరణ శాఖ. నేను అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లో వర్షం విపరీతంగా పడుతుంది. దీంతో చాలా కాలనీలు జలమయమయ్యాయి. ఇవాళ కూడా అదే పరిస్థితి నెలకొంటుందని చెబుతున్నారు.
భారీ వర్షాలతో పత్తి రైతులకు ఊరట
ప్రస్తుతం కురుస్తున్న వర్షపాతం.. పత్తి రైతులకు ఊరట కలిగించే అంశం అని నిపుణులు చెబుతున్నారు. 15 రోజులపాటు కొట్టిన ఎండల కారణంగా.. రేగడి భూముల్లో పత్తి చేన్లు కాస్త ఎండిపోయాయి. అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్న నేపథ్యంలో... అలాంటి పంటలకు మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక మూడు రోజులపాటు ఇలాగే వర్షపాతం ఉంటే.. సరిపోతుందని చెబుతున్నారు.






