తెలంగాణకు భారీ వర్షసూచన.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు

by Ajay Maddhiboyina |

తెలంగాణలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ వచ్చినా ఈ ఏడాది వానలు మాత్రం తగ్గడం లేదు. క్లౌడ్ బరస్ట్‌లతో కొన్నిప్రాంతాల్లో అయితే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్న పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.

తెలంగాణకు భారీ వర్షసూచన.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ వచ్చినా ఈ ఏడాది వానలు మాత్రం తగ్గడం లేదు. క్లౌడ్ బరస్ట్‌లతో కొన్నిప్రాంతాల్లో అయితే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్న పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. కాగా నేడు కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నాగ‌ర్ క‌ర్నూల్, న‌ల్గొండ‌, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువ‌న‌గిరి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, సంగారెడ్డి, వ‌న‌ప‌ర్తి, మెద‌క్, నారాయ‌ణ్ పేట్, సిద్దిపేట్, కామారెడ్డి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపారు. ఇత‌ర జిల్లాల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్ లో మ‌ద్యాహ్నం నుండి సాయంత్రం స‌మ‌యాల్లో భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు.

Next Story