TELANGANA: ఈ రోజు కూడా జోరు వానలు..ఈ జిల్లాలకు అలర్ట్

by Ajay Maddhiboyina |

తెలంగాణలో ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే రాష్ట్రంలో అధిక వర్షాపాతం నమోదయ్యింది. ప్రాజెక్టులు నీటితో నిండిపోయాయి. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి.

TELANGANA: ఈ రోజు కూడా జోరు వానలు..ఈ జిల్లాలకు అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే రాష్ట్రంలో అధిక వర్షాపాతం నమోదయ్యింది. ప్రాజెక్టులు నీటితో నిండిపోయాయి. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఇక నేడు కూడా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది.

ఇక ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట్, నాగ‌ర్ క‌ర్నూల్, వ‌న‌ప‌ర్తి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, రంగారెడ్డి, ములుగు, మ‌హ‌బూబాబాద్, వ‌రంగ‌ల్, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాల్లోనూ ఉరుముల‌తో కూడిన వ‌ర్షాలు మ‌ద్యాహ్నం నుండి రాత్రి వ‌ర‌కు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది. మిగితా ప్రాంతాల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. అదేవిధంగా హైద‌రాబాద్ లో మ‌ద్యాహ్నం వ‌ర‌కు వాతావ‌ర‌ణం పొడిగా ఉంటుంద‌ని, మ‌ద్యాహ్నం నుండి రాత్రి వ‌ర‌కు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.

Next Story