బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

by velandi.Saikiran |

రేపటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడతాయని వెల్లడించింది.

heavy rains in telangana for three days
X

heavy rains in telangana for three days 

దిశ‌, వెబ్ డెస్క్‌: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే ప్రమాదం పంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని అంచనా వేసింది. మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. హిందూ మహా సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది వాతావరణ శాఖ. దీని ఎఫెక్ట్ కారణంగా అకాల వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. అటు ఏపీకి కూడా వ‌ర్షాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు.

రైతులకు అపార నష్టమే !

అకాల వర్షాలు రైతుల‌కు అపార న‌ష్టం చేసేలా ఉన్నాయి. ఈ ఫిబ్రవరి చివరి నాటికి వరి ప్రారంభ దశలో, మొక్కజొన్న కంకి దశలో ప్రస్తుతం ఉన్నాయి. ఇలాంటి సమయంలో అకాల వర్షాలు పడితే రైతులకు తీవ్ర నష్టమే కలిగే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. మరి వరుణ దేవుడు ఏం చేస్తాడో చూడాలి.

Next Story