తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు

by Ajay Maddhiboyina |

తెలంగాణ‌లో గ‌త కొద్దిరోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. మూడు నాలుగు రోజులుగా గ్యాప్ లేకుండా తేలిక‌పాటి నుండి భారీ వర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఈ రోజు కూడా కొన్ని జిల్లాల్లో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తాయ‌ని వెద‌ర్ మ్యాన్ పేర్కొన్నారు. నాగ‌ర్ క‌ర్నూల్, న‌ల్గొండ‌, సూర్యాపేట్, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్, భ‌ద్రాద్రి కొత్తగూడెం,

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ‌లో గ‌త కొద్దిరోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. మూడు నాలుగు రోజులుగా గ్యాప్ లేకుండా తేలిక‌పాటి నుండి భారీ వర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఈ రోజు కూడా కొన్ని జిల్లాల్లో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తాయ‌ని వెద‌ర్ మ్యాన్ పేర్కొన్నారు. నాగ‌ర్ క‌ర్నూల్, న‌ల్గొండ‌, సూర్యాపేట్, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్, భ‌ద్రాద్రి కొత్తగూడెం, మ‌హబూబ్ న‌గ‌ర్, వ‌న‌ప‌ర్తి, గద్వాల్, నారాయ‌ణ్ పేట్, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువ‌న‌గిరి, జ‌న‌గాం, ములుగు, వ‌రంగ‌ల్, భూపాల్‌ప‌ల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అంతే కాకుండా మెదక్, సిద్దిపేట్, సంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుండి మధ్యస్థంగా కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా హైదరాబాద్ లో మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో ఒకటి రెండు సార్లు వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు.

Next Story