హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. చెరువులను తలపిస్తున్న రోడ్లు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-09-17 17:09:21  IST  )

హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. ఉదయం నుండి నేడు పలు చోట్ల వర్షం కురవగా దాదాపు గంట నుండి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మణికొండ, నార్సింగి, అఫ్జల్ గంజ్, లింగంపల్లి, పంజాగుట్ట, సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లపైకి వరదనీరు చేరింది.

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. చెరువులను తలపిస్తున్న రోడ్లు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. ఉదయం నుండి నేడు పలు చోట్ల వర్షం కురవగా దాదాపు గంట నుండి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మణికొండ, నార్సింగి, అఫ్జల్ గంజ్, లింగంపల్లి, పంజాగుట్ట, సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లపైకి వరదనీరు చేరింది. టోలిచైకి వద్ద ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. ఐకియా నుండి మాదాపూర్, కేపీహెచ్‌బీ వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. మెట్రో స్టేషన్ల కింద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది.

కొద్దిసేపటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తుండగా నగరంలో భారీ వర్షాపాతం నమోదైనట్టు తెలుస్తోంది. మియాపూర్ లో 9.7 సెం.మీ, లింగంపల్లిలో 8.2 సెం.మీ, HCUలో 8.1సెం.మీ, గచ్చిబౌలిలో 6.6,చందానగర్‌లో 6.4, హఫీజ్‌పేట్‌లో 5.6, ఫతేనగర్‌లో 4.7 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు సమాచారం. మరోవైపు 10.45 గంటల వరకు పరిస్థితి ఇలానే ఉండొచ్చని, ఆ తరవాత వర్షం తగ్గుముఖం పట్టొచ్చని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. భారీ వర్షం కారణంగా అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.


Next Story