రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. రాబోయే 3 రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు

by Disha Web Desk 7 |
రాష్ట్ర ప్రజలకు అలర్ట్.. రాబోయే 3 రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ పక్కా రాష్ట్రంలో ఎండలు అధికంగా నమోదు అవుతూనే మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. అది కూడా ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఈ వర్షాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే.. తాజాగా వెదర్ రిపోర్ట్ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అంతే కాకుండా వచ్చే 5 రోజులు పగటి ఉష్ణ్రోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతాయని తెలిపింది.

Next Story

Most Viewed