- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rain alert: ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన..3 రోజులు దంచికొట్టే వానలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్డ్ జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్డ్ జారీ చేసింది. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్డ్ జారీ చేసింది. అంతే కాకుండా 11 జిల్లాలకు ఎల్లో అలర్డ్ జారీ చేసింది. గంటలకు 30 నుండి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వీటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఏపీలోనూ రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి చైనా హాంకాంగ్‌లో బీభత్సం సృష్టించిన విఫా తుఫాన్ బంగాళాఖాతంలోకి ప్రవేశించి రాబోయే 3 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.






