- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Heavy rains: రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ సూచన
రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Meteorological Department) తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు గాలి వేగం గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో రాష్ట్రంలో అంతటా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హైదరాబాద్ జిల్లాతో పాటు సిద్దిపేట, జగిత్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
వర్షాలకు కారణాలు..
మరఠ్వాడా ప్రాంతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. నుంచి 3.1 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. దక్షిణ మహారాష్ట్ర నుంచి పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి తెలంగాణ, రాయలసీమ మీదుగా వెళ్తోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఉంది. మరో ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి తూర్పు విదర్భ, తెలంగాణ, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ వర్షాల వల్ల నగరంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
వర్షపాతం వివరాలు..
హైదరాబాద్ జిల్లాలో అంబర్ పేట్ లో 15 సెం.మీ, సిద్దిపేట జిల్లా వర్గల్ లో 11 సెం.మీ, హైదరాబాద్ జిల్లా గోల్కొండలో 10 సెం.మీ, షేక్ పేట్ లో 10 సెం.మీ, హైదరాబాద్ లో 11 సెం.మీ, సిద్దిపేట జిల్లా కావేరిలో 10 సెం.మీ, హైదరాబాద్ జిల్లా హిమాయత్ నగర్ లో 10 సెం.మీ, జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో 8 సెం.మీ, సంగారెడ్డి జిల్లా కందిలో 7 సెం.మీ, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 7 సెం.మీ, మంచిర్యాల జిల్లా కాసిపేట్ లో 6 సెం.మీ, నిర్మల్ జిల్లా ముధోల్ లో 6 సెం.మీ, సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 6 సెం.మీ, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ లో 6 సెం.మీ, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 6 సెం.మీ, సంగారెడ్డి జిల్లా మునిపల్లిలో 6 సెం.మీ, కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో 5 సెం.మీ, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ లో 5 సెం.మీ, హకీంపేట్ లో 5సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.






