తెలంగాణను భారీగా డ్యామేజ్ చేసిన వర్షాలు.. ఎంత నష్టం జరిగిందంటే?

by Gantepaka Srikanth |

తెలంగాణ వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు(Heavy Rains) కురుస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణను భారీగా డ్యామేజ్ చేసిన వర్షాలు.. ఎంత నష్టం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు(Heavy Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ వర్షాల కారణంగా భారీ నష్టం వాటిల్లిందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ(Panchayat Raj Department) పేర్కొంది. రాష్ట్రంలో 124 చోట్ల 84 కిలోమీటర్ల మేర రోడ్లు(Telangana Roads) దెబ్బతిన్నాయని పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. రోడ్లు, కల్వర్టుల తాత్కాలిక పునరుద్ధరణకు రూ.6.02 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. శాశ్వత పునరుద్ధరణకు రూ.141 కోట్ల వరకూ అవుతుందని అధికారులు పేర్కొన్నారు. దెబ్బతిన్న రోడ్ల ప్రాథమిక అంచనాలను అధికారులు సంబంధిత మంత్రి సీతక్కకు అందజేశారు. కలెక్టర్ల నిధులతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ఈ సందర్భంగా సీతక్క ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. జాగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Next Story