- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన భారీ వర్షం.. బీ అలర్ట్..
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది. దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి, నారాయణగూడ, సికింద్రాబాద్, మారేడుపల్లి, బోయిన్ పల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది. దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి, నారాయణగూడ, సికింద్రాబాద్, మారేడుపల్లి, బోయిన్ పల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రానికి నగరమంతా వర్షం వ్యాపిస్తుందని వాతావరణశాఖ పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, 9 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, సీపీ సీవీ ఆనంద్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా టీమ్స్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.






