TG:ఆ జిల్లాలకు రెయిన్ అలర్ట్.. రానున్న మూడు గంటల్లో భారీ వర్షం

by Jakkula.Mamatha |

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి.

TG:ఆ జిల్లాలకు రెయిన్ అలర్ట్.. రానున్న మూడు గంటల్లో భారీ వర్షం
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ఇటీవల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత రెండు మూడు రోజుల నుంచి తెలంగాణలో ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉదయాన్నే భానుడు తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. కానీ, సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీస్తున్నాయి.

అయితే తాజాగా మరోసారి హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రవేశించిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి.

ఈ తరుణంలో తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో రాబోయే 3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావరణ శాఖ(Meteorological Department) అధికారులు అంచనా వేస్తున్నారు. యాదాద్రి, జనగామ, ములుగు, భద్రాద్రి, మహాబూబాబాద్, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఈ రోజు రాత్రి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దు అని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Next Story