- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గత రెండు, మూడు రోజులుగా ఉదయం వేళల్లో ఎండగా ఉండి మధ్యాహ్నం అవ్వగానే వర్షం దంచికోడుతోంది. మంగళవారం రోజు కూడా ఉదయం ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా నల్లని మేఘాలు కమ్ముకుని వర్షం మొదలైంది. ఖైరాతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, అంబర్‌పేట్, తార్నాక, ఉప్పల్, చాదర్‌ఘాట్, సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, హిమాయత్‌నగర్, నల్లకుంట, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. భారీగా ట్రాఫీక్ జామ్ ఏర్పడి, ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, జులై 24వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ క్రమంలో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.






