హైదరాబాద్‌లో వడగళ్ల వాన.. ఒక్క సారిగా మారిపోయిన వాతావరణం..

by velandi.Saikiran |   (  Updated:2025-04-10 10:46:21  IST  )

హైదరాబాద్ ( Hyderabad) మహా నగరంలో భారీ వర్షం ( Rain) మళ్లీ మొదలైంది. నిన్న అర్ధరాత్రి తెలంగాణ ( Telangana state) వ్యాప

హైదరాబాద్‌లో వడగళ్ల వాన.. ఒక్క సారిగా మారిపోయిన వాతావరణం..
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ( Hyderabad) మహా నగరంలో భారీ వర్షం ( Rain) మళ్లీ మొదలైంది. నిన్న అర్ధరాత్రి తెలంగాణ ( Telangana state) వ్యాప్తంగా వర్షం పడగా... ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ లో మొదలైంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం నాలుగు కాగానే... కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా పడుతోంది.

మాదాపూర్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతాలలో వర్షం దంచి కొడుతోంది.. దీంతో వాహనదారులు ( Motorists) చాలా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం పడడంతో... రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు... ట్రాఫిక్ సమస్యతో ( Traffic problem ) ఇబ్బంది పడుతున్నారు.

ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బంగాళాఖాతంలో ( Bay of Bengal) కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా... తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ముఖ్యం గా సంగారెడ్డి (Sanga reddy), వికారాబాద్ లో దట్టంగా క్యూమిలో నింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. దింతో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వేయనున్నాయి. ఈ రెండు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వచ్చే మూడు గంటల పాటు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు.

Next Story