హైదరాబాద్‌లో కుండ‌పోత‌ వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్

by velandi.Saikiran |   (  Updated:2026-03-27 18:11:29  IST  )

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ స‌మ‌స్య త‌లెత్తింది. దీంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డుతున్నారు.

హైదరాబాద్‌లో కుండ‌పోత‌ వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ‌, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహా నగరంలో వర్షం మళ్లీ మొదలైంది. శుక్ర వారం సాయంత్రం 8 దాటిన తర్వాత హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం షురూ అయింది. కొంపల్లి, సుచిత్ర, అల్వాల్, జూబ్లీహిల్స్, చందానగర్, దుండిగల్, నిజాంపేట్, శేరిలింగంపల్లి, షాపూర్ నగర్, జీడిమెట్ల, కూకట్ ప‌ల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, బాలాజీ నగర్, మూసాపేట్, బాలా నగర్, జవహర్ నగర్, కాప్రా, దమ్మాయిగూడ, యాప్రాల్, ప్రశాంతి నగర్, మల్లం పేట లాంటి తదితర ప్రాంతాలలో భారీ వర్షం పడుతోంది.

దీంతో వాహనదారులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో సిటీలో ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈ క్ర‌మంలోనే వాహ‌నాలు ముందుకు క‌ద‌ల‌డం లేదు. గంట‌ల త‌ర‌బ‌డి, వాహ‌నాలు రోడ్ల‌పైనే నిలుస్తున్నాయి. కాగా, శుక్ర వారం ఉద‌యం మొత్తం హైద‌రాబాద్ లో ఎర్ర‌టి ఎండ దంచికొట్టింది. దీంతో జ‌నాలు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ, సాయంత్రం కాగానే వ‌ర్షం మొద‌లైంది. క్లిక్

Next Story