- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rain alert: తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 10 గంటల తర్వాత నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని IMD హెచ్చరించింది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు (Meteorological department warning) జారీ చేసింది. ఈ రోజు ఉదయం 10 గంటల తర్వాత నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని IMD హెచ్చరించింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మేఘాలు అలుముకోవడంతో పలు ప్రాంతాల్లో వర్షం (Rain) మొదలైంది. అలాగే ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దీంతో పాటుగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అలాగే ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి, అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లోను మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి సూచించింది. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం హైదరాబాద్ (Hyderabad) నగర వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. ఉదయం 8 గంటల తర్వాత నగర వ్యాప్తంగా మేఘాలు అలుముకొవడంతో.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, అత్తాపూర్, ఫలక్ నుమా, అల్వాల్, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ, చింతల్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పాడి ఉద్యోగాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.






