బిగ్ అలర్ట్ : నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

by Dishanational2 |
బిగ్ అలర్ట్ : నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
X

దిశ, వెబ్ ‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో గత రెండు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో ఈరోజు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అలాగే ఏపీలో ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కుర్తుస్తాయని, గంటకు 30 నుంచి 40 కీలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. ఇక ఈ అకాల వర్షాల నేపథ్యంలో రైతులందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనుందంట.



Next Story

Most Viewed