TG: ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

by Gantepaka Srikanth |

రాష్ర్టంలో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

TG: ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్టంలో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గాలివేగం గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బుధవారం ఆదిలాబాద్, కుమరం భీం అసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశముందని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్ జారీ చేసింది.

రేపు తీరం దాటనున్న మొంథా తుఫాన్:

బంగాళాఖాతం నుంచి ముంచుకొస్తున్న మొంథా తుఫానుతో రాష్ర్టంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది మరింతగా ఉత్తర వాయువ్య దిశగా పయనించి మంగళవారం సాయంత్రం నాటికి ఏపీ లోని కాకినాడ సమీపంలో మొంథా తుఫాను తీరం దాటే అవకాశాలున్నట్లు పేర్కొంది. తీరం దాటే సమయంలో దీని గాలివేగం గంటకు 90 నుండి 100 కి.మీ లుగా గరిష్టంగా 110 కి.మీ ఉండే అవకాశముందని, ఈ సమయంలో ఇది తీవ్ర తుఫాను రూపంలోనే తీరం దాటనున్నట్లు తెలిపింది. దీంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలుజిల్లాల్లో అతిభారీ కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Next Story