బీ అలర్ట్ : రాబోయే 3 గంటల్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు

by samatah |

తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్. నేడు, రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే

బీ అలర్ట్ : రాబోయే 3 గంటల్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్. నేడు, రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.ముఖ్యంగా హైదరాబాద్‌, ఇతర జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనున్నట్లు ప్రకటన చేసింది ఐఎండీ.

అందువలన ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక ఇప్పటికే తెలంగాణలో ఇటీవలన కురిసిన వడగండ్ల వానకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందొచ్చిన పంట నేల పాలైంది. ఇక ఇప్పుడూ వర్షం పడే అవకాశం ఉండటంతో రైతుల్లో ఆందోళనర మొదలైంది.

Next Story