- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరికాసేపట్లో భారీ వర్షం!.. ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలకు పోలీసులు కీలక ఆదేశాలు
హైదరాబాద్ నగరానికి మరికాసేపట్లో భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులకు త్వరగా లాగౌట్ అయ్యేలా చూడాలని సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఇవాళ సాయంత్రం భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం వేళల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో రోడ్లపై తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ఇవాళ 3:30 గంటల నుండే ఉద్యోగులకు దశలవారీగా ముందస్తు లాగౌట్‌లు (Early Logouts) కల్పించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అన్ని సంస్థల యాజమాన్యాలకు సూచన చేశారు. విపత్కర వాతావరణ పరిస్థితుల్లో అత్యవసర సేవలు సజావుగా సాగడానికి, రోడ్లపై మౌలిక సదుపాయాలపై ఒత్తిడి తగ్గించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రయాణికులు, వాహనదారుల భద్రత రిత్యా యాజమాన్యాలు సహకరించాలని రిక్వెస్ట్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేశారు.






