- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నేడు (గురువారం) వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, జనగాం, మెదక్, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించింది.
కాగా.. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ నుంచి సీఎంఓ అధికారులతో మాట్లాడిన సీఎం రేవంత్.. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad)తో పాటు భారీ వర్షాలు కురుస్తోన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.






