తుఫాన్ ఎఫెక్ట్.. రాబోయే 5 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం

by Ajay Maddhiboyina |

తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హన్మకొండలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కాగా రాబోయే 5గంటల్లో పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు.

తుఫాన్ ఎఫెక్ట్.. రాబోయే 5 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హన్మకొండలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కాగా రాబోయే 5గంటల్లో పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో 200 నుండి 240mm వర్షాపాతం నమోదైందని, ఆ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 300 నుండి 350mm వ‌ర్షాపాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు.

అంతే కాకుండా వ‌రంగ‌ల్ జిల్లాలో వ‌ర‌ద‌లు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని, అర్ధ‌రాత్రి వ‌ర‌కు కుండ‌పోత వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌న్నారు. జ‌న‌గాం, క‌రీంన‌గ‌ర్, జ‌గిత్యాల‌, సిద్ధిపేట‌, సిరిసిల్ల ప్రాంతాల్లోనూ భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొన్నారు. మంచిర్యాల‌, పెద్ద‌ప‌ల్లి, నిర్మ‌ల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల‌నూ వ‌ర్షాలు ముంచెత్తే అవ‌కాశం ఉంద‌న్నారు. యాదాద్రి భువ‌న‌గిరి, మెద‌క్, రంగారెడ్డి జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో 100mm వర్షాపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు.

Next Story