- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
రాష్ట్రంలో పలుప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు రాష్ర్టంలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పలుప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు రాష్ట్రంలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో గాలివేగం గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మంగళవారం భారీ వర్షాల సూచనలున్న నేపథ్యంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫాన్ మంగళవారం రాత్రి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుండి 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తోంది. ఈ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
అత్యధికంగా చౌటుప్పల్ లో 6 సెం.మీ ల వర్షం:
రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు హైదరాబాద్ వాతావరణక కేంద్రం తెలిపింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో 6 సెం,మీ, రంగారెడ్డి జిల్లా మంచల్ లో 6 సెం.మీ, సంగారెడ్డిలో 5 సెం.మీ, సంగారెడ్డి జిల్లా కందిలో 5 సెం.మీ, సదాశివపేట్ 4 సెం.మీ, కొండాపూర్ లో 3 సెం.మీ, మెదక్ జిల్లా రైకోడ్ లో 3 సెం.మీ, నేకల్ లో 3 సెం.మీ, జోగిపేట్ లో 3 సెం.మీ, మునిపల్లి లో 3 సెం.మీ, నారాయణ ఖేడ్ లో 3 సెం.మీ, మంచిర్యాల జిల్లా చెన్నూరులో 3 సెం.మీ, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 3 సెం.మీ, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో 3 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది.






