హైదరాబాదీలకు అలర్ట్.. మరికొద్దిసేపట్లో ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం!

by Ajay Maddhiboyina |

హైద‌రాబాద్‌లో మరికొద్దిసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. ముఖ్యంగా సౌత్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, చాంద్రాయణగుట్ట, ఉప్పల్, నాగోల్, చార్మినార్, మీర్ పేట్, గుర్రంగూడ, బీఎన్ రెడ్డి,

హైదరాబాదీలకు అలర్ట్.. మరికొద్దిసేపట్లో ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం!
X

దిశ, వెబ్ డెస్క్: హైద‌రాబాద్‌లో మరికొద్దిసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. ముఖ్యంగా సౌత్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, చాంద్రాయణగుట్ట, ఉప్పల్, నాగోల్, చార్మినార్, మీర్ పేట్, గుర్రంగూడ, బీఎన్ రెడ్డి, సైదాబాద్, రాజేంద్రనగర్, ఆరామ్‌ఘర్, బృహ‌న్ పేట‌, మ‌లాపురం, బ‌ర్కాస్, బ‌హ‌దూర్‌పుర, కిషన్ బాగ్, మలక్‌పేట్, నాంపల్లి, ఆసిఫ్‌నగర్, అత్తాపూర్, లంగర్ హౌస్, బండ్లగుడ జాగీర్ ప్రాంతాల్లో సాయంత్రం 6.20 నుండి రాత్రి 8.20 వరకు భారీ వర్షం కురుస్తుందని తెలిపారు. అంతే కాకుండా నగరంలోని మిగితా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Next Story