- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Heavy Rain: హైదరాబాద్ లో భీకర వాన.. ఈ జిల్లాల్లో నేడు రేపు భారీ వానలు
తెలంగాణలో మళ్లీ దంచికొడుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని పలు జిల్లాల్లో మళ్లీ వాన దంచి కొడుతోంది. ఇవాళ హైదరాబాద్‍లో (Hyderabad) పలు చోట్ల భీకర వాన (Heavy rains) కురిసింది. నిమిషాల వ్యవధిలోనే వాగులను తలపించేలా వాననీటితో నగర రోడ్లు జలమయం అయ్యాయి. అమీర్ పేట్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఎల్బీనగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెంట్, ఎర్రగడ్డ, బోరబండ ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లోనూ వానలు కురిశాయి.
రెండురోజుల పాటు భారీ వర్షాలు:
ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఈనెల 26న వాయుగుండంగా బలపడనుందని తెలిపింది. 27న వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ ఒడిశా-ఉత్తరాంద్ర కోస్తా తీరంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.






