- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. భయంకరమైన ఉరుములు, మెరుపులు
గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా భారీ వర్షం(Heavy Rain) దంచికొడుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా భారీ వర్షం(Heavy Rain) దంచికొడుతోంది. భయంకరమైన, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో నగరంలోని జనజీవనం అస్తవ్యవస్థమైంది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. రోడ్లపైకి వరదనీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మూసాపేట, అమీర్‌పేట, పంజాగుట్ట, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీ నగర్, పంజాగుట్ట, లక్డీకపూల్, నారాయణగూడ, ఖైరతాబాద్, సోజాజీగూడ, అమీర్ పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హయత్ నగర్, ఉప్పల్, అంబర్ పేట్ ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఆయా మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నగరం నలువైపులా వాహనాల్లో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. పలు వాహనాలు వాననీటిలో చిక్కుకున్నాయి. దీంతో వెంటనే హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పోలీసులు రంగంలోకి సహాయక చర్యలు చేపట్టారు.






