- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HMDA: సరూర్‌నగర్‌లో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు.. ఎందుకంటే?
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థకు చెందిన సరూర్‌నగర్ హుడా కమర్షియల్ కాంప్లెక్స్‌ను వెంటనే ఖాళీ చేయాలని అధికారులు లీజుదారులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థకు చెందిన (Saroor Nagar) సరూర్‌నగర్ హుడా (Huda) కమర్షియల్ కాంప్లెక్స్‌ను వెంటనే ఖాళీ చేయాలని అధికారులు లీజుదారులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సరూర్‌నగర్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శిథిలావస్థలో ఉన్న కాంప్లెక్స్ మరమ్మతుల కోసం వెంటనే ఖాళీ చేయాలని హెచ్ఎండీఏ (HMDA) అధికారులు షాపుల లీజుదారులను ఖాళీ చేయిస్తున్నారు. దీంతో దుకాణదారులు అందుకు నిరాకరించారు. కేసు కోర్టులో ఉందని దుకాణదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని అధికారులు సమాధానం చెబుతున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తత మారడంతో సరూర్‌నగర్‌లో భారీగా పోలీసులు మోహరించారు. భారీ బందోబస్తు నడుమ లీజుదారులను అధికారులు ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా, సరూర్‌నగర్‌లో 1981 అప్పటి హుడా 32 షాపులతో వాణిజ్య భవనాన్ని నిర్మించి స్థానిక వ్యాపారులకు లీజుకు ఇచ్చింది. గడువు 2008లోనే ముగిసిందని, అయిన చాలా మంది భవనం ఖాళీ చేయకుండా కొనసాగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. తాజాగా ఓయూలోని ఇంజినీరింగ్ విభాగం ఈ భవనంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో మరమ్మతులు చేయాలని తెలిపింది. దీంతో లీజు దారులకు గతంలో నోటీసులు జారీ చేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. న్యాయం స్థానం సూచనలతో హెచ్ఎండీఏ అధికారులు నోటీసులిచ్చారు.. వెంటనే ఖాళీ చేయాలని కోరారు.






