శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద.. కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి షురూ

by Bhanu |

ఎగువన ఉన్న ఆల్మట్టి , జూరాల ప్రాజెక్టుల నుండి కృష్ణా నదిలో భారీగా వరద ప్రవహిస్తూ, దిగువన ఉన్న శ్రీశైలం జలాశయాని..

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద.. కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి షురూ
X

దిశ, అచ్చంపేట : ఎగువన ఉన్న ఆల్మట్టి , జూరాల ప్రాజెక్టుల నుండి కృష్ణా నదిలో భారీగా వరద ప్రవహిస్తూ, దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుండి వరద ప్రవాహం గంట గంటకూ ఉద్ధృతమవుతుండటంతో, అక్కడి నుండి 65159 క్యూసెక్కుల నీరు శ్రీశైలం వైపు చేరుతోందని అధికారులు విడుదల చేసిన వరద ప్రభావ బులిటెన్‌లో పేర్కొన్నారు.

శ్రీశైలం జలాశయానికి గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం అది 875.70 అడుగులకు చేరింది. జూరాల ప్రాజెక్టు నుండి 32034 క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా, స్పిల్‌వే ద్వారా 33125 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. సుంకేశుల , హంద్రీనీవా ప్రాజెక్టుల నుండి ప్రస్తుతం ఎలాంటి ప్రవాహం లేదు.

ఇక విద్యుత్ ఉత్పత్తి విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్‌లోని కుడి గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 35315 క్యూసెక్కులు, తెలంగాణ రాష్ట్ర ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 23263 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాలూ కలిపి 58578 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగిస్తున్నారు. వరద ప్రవాహం ఇప్పటికీ కొనసాగుతుండటంతో, అధికారులు నిత్యనిరీక్షణలో ఉన్నారు.

Next Story