TG: ఎగువన భారీ వర్షాలు.. జూరాలకు పెరుగుతున్న వరద

by Gantepaka Srikanth |

ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దాంతో ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతున్నది.

TG: ఎగువన భారీ వర్షాలు.. జూరాలకు పెరుగుతున్న వరద
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దాంతో ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతున్నది. ఇన్ ఫ్లో 71 వేల క్యూసెక్కులు వస్తుండండడంతో ప్రాజెక్టు పది గేట్లను ఓపెన్ చేశారు. పదిగేట్ల ద్వారా 75,833 క్యూసెక్కులు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 317.440 మీటర్లు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.535 టీఎంసీలు ఉంది. కాగా.. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 9 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.

Next Story