రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు.. హైదరాబాద్-విజయవాడ హైవే‌పై ట్రాఫిక్ జామ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-01 05:04:44  IST  )

నిత్యం అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు.. హైదరాబాద్-విజయవాడ హైవే‌పై ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే, ఇటీవల మొంథా తుపాను కారణంగా కురిసిన వరుస వర్షాలకు చిట్యాల రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ పరిణామంతో హైదరాబాద్‌ నుంచి నార్కట్‌పల్లి వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో పెద్దకాపర్తి స్టేజ్ నుంచి చిట్యాల పట్టణం వరకు సుమారు 5 కి.మీ మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచాయి. ఈ క్రమంలోనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతరం స్పాట్‌కు చేరుకున్న పోలీసులు వాహనాలను నెమ్మదిగా ముందుకు పంపుతూ ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.

Next Story