- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: సైక్లింగ్ కాదు.. బోటింగ్ చేయొచ్చు..! కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన నెటిజన్లు
నగరంలో ఎక్కడ చూసిన వరద ప్రవాహమే కన్పించింది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (viral video) హైదరాబాద్ పరిధిలో గురువారం మధ్యాహ్నం నుంచి వర్షం దంచికొట్టడంతో.. నగరం అతలాకుతలం అయింది. రోడ్లపైకి, కాలనీలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇక, వర్షంలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల వాహనదారులకు చుక్కలు కనిపించాయి. ఎక్కడ చూసిన వరద ప్రవాహమే కన్పించింది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్‌ను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నార్సింగ్ పరిధిలో నిర్మించిన విషయం తెలిసిందే. అయితే నానక్‌రామ్ గూడ వద్ద (cycle track) సైకిల్ ట్రాక్‌పై భారీగా వరద నీరు ప్రవహించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేశారు. ఈ ట్రాక్‌లో సైక్లింగ్ బదులు బోటింగ్ చేయోచ్చని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. బోటింగ్ ట్రాక్ నిర్మించినందుకు కేటీఆర్‌కు పలువురు నెటిజన్లు థ్యాంక్స్ అంటూ సెటైర్లు వేశారు. సైకిల్ ట్రాక్‌పైకి వరద నీరు రావడం.. జీహెచ్ఎంసీ, హైడ్రా నిర్వహణ లోపం కనిపిస్తోందని ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలిచింది. కాగా, నార్సింగ్ దగ్గర దాదాపు 23 కిలోమీటర్ల మేర సోలార్ సైకిల్ ట్రాక్‌ని 2023 అక్టోబర్ 1న నాటి మంత్రి కేటీఆర్ (KTR) ప్రారంభించారు. వైరల్ వీడియో లింక్..






