- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రానున్న 2 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. నేడు హైదరాబాద్‌లో వాతావరణం ఇలా..
రెండ్రోజులుగా హైదరాబాద్ వాసులను భారీ వర్షాలు భయపెడుతున్నాయి. సాయంత్రమైతే చాలు.. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు నగరంలో జనజీవనం అస్తవ్యస్తమయింది.

దిశ, వెబ్‌డెస్క్: రెండ్రోజులుగా హైదరాబాద్ వాసులను భారీ వర్షాలు భయపెడుతున్నాయి. సాయంత్రమైతే చాలు.. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు నగరంలో జనజీవనం అస్తవ్యస్తమయింది. ఇక నేడు కూడా నగరానికి భారీ వర్షసూచన ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ (Telangana Weatherman) ఎక్స్ లో తెలిపారు. రానున్న 2 గంటల్లో పటాన్ చెరు, లింగంపల్లి, బీరంగూడ, అమీన్ పూర్ ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు అలుముకుని భారీ వర్షం కురవవచ్చని అంచనా వేశారు. అలాగే మధ్యాహ్నం తర్వాత నగరమంతా మేఘాలు కమ్మి వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపారు.
సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముందుగా అంచనా వేసిన దానిప్రకారం.. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో రాత్రి భారీ వర్షాలు కురిసినట్లు పేర్కొన్నారు.






