తెలంగాణకు ఎండల సెగ.. జూన్ 16 వరకు కొనసాగనున్న హీట్‌వేవ్

by Malleboina Mahesh |

తెలంగాణ ప్రజలకు మే నెలలో నిప్పుల కొలిమి! జూన్ 16 తర్వాతే రుతుపవనాల రాక. బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో ముదిరిన ఎండలు.

తెలంగాణకు ఎండల సెగ.. జూన్ 16 వరకు కొనసాగనున్న హీట్‌వేవ్
X

దిశ, వెబ్ డెస్క్: వాతావరణ శాఖ ముందస్తు అంచనాలకు తగ్గట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, వరంగల్ వంటి తూర్పు తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన ఉష్ణ గాలులు వీస్తున్నాయి. అయితే, ఈ విపరీతమైన ఎండల ప్రభావం వల్ల రాబోయే రెండు గంటల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అలాగే హైదరాబాద్‌లో మాత్రం వాతావరణం పొడిగానే ఉండి ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

మరోవైపు, నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రుతుపవనాలు అండమాన్ దీవులకు, కేరళకు సమయానికే చేరుకున్నప్పటికీ, తెలంగాణకు మాత్రం ఈ ఏడాది ఆలస్యంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. మే 16 నుండి జూన్ 16 వరకు రాష్ట్రంలో సుదీర్ఘమైన హీట్‌వేవ్ (తీవ్రమైన ఎండలు) కొనసాగవచ్చని, జూన్ 16 తర్వాతే రుతుపవనాల ప్రవేశం ఉంటుందని ప్రాథమిక అంచనా. దీనికి తోడు మే ద్వితీయార్థంలో బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్న తుఫాను మార్గం మారడం (Recurving Cyclone) వల్ల రాష్ట్రంలో మరింత భయంకరమైన ఉష్ణగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story