నిప్పుల కొలిమిలా తెలంగాణ.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 11 దాటితే బయటకు రావొద్దు

by Ajay Maddhiboyina |

ఎండల ప్రభావం పెరిగిపోతుండటంతో తెలంగాణ నిప్పుల కొలిమిలా మారుతోంది. ఉదయం 6గంటల నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ జనాలకు చుక్కలు చూపిస్తున్నాడు.

నిప్పుల కొలిమిలా తెలంగాణ.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 11 దాటితే బయటకు రావొద్దు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఎండల ప్రభావం పెరిగిపోతుండటంతో తెలంగాణ నిప్పుల కొలిమిలా మారుతోంది. ఉదయం 6గంటల నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ జనాలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ రోజు ఎండ తీవ్రత కొన్ని జిల్లాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. ఈ రోజు తెలంగాణలో తీవ్రమైన వడగాలులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో 47 డిగ్రీల వరకు ఊష్ణోగ్రతలు ఉండొచ్చని అంచనా వేశారు.

ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, నిజామాబాద్, భూపాల్ పల్లి, హన్మకొండ, ములుగు, వరంగల్, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో 44 నుండి 47 డిగ్రీల ఊష్ణోగ్రలు ఉండే అవకాశం ఉందని, ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయట తిరిగితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ లో సైతం ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపారు. ఇక వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

Next Story